తెలంగాణ

telangana

ETV Bharat / city

భార్య.. అమ్మ.. కండక్టరే కాదు .. ఓ మంచి డ్యాన్సర్ కూడా .. ఆమె ఝాన్సీ

Conductor Jhansi: ఝాన్సీ ..పేరు వినగానే ఓ ఎమోషన్ తన్నుకొస్తుంది. స్వతంత్ర పోరాట ఘట్టం ఝాన్సీ పేరు లేనిదే మొదలు కాదమో అంటే అతిశయోక్తి కాదమో. ఓ వనిత ధీరత్వం.. సాహసం అంటే.. ఝాన్సీ లక్ష్మిభాయే గుర్తుకొస్తుంది. అలాంటి పేరే కాదు..లక్షణాలను పుణికి పుచ్చుకుని, పల్సర్ బైక్ స్పీడ్​తో కుర్రకారులో దడ పుట్టిస్తోన్నఏపీ గాజువాక ఝాన్సీపై ప్రత్యేక కధనం.

ఝాన్సీ
ఝాన్సీ

By

Published : Sep 15, 2022, 9:13 PM IST

భార్య.. అమ్మ.. కండక్టరే కాదు .. ఓ మంచి డ్యాన్సర్ కూడా .. ఆమె ఝాన్సీ

Conductor Jhansi: పల్సర్​ బండి మీద రారా బావ పాట వినే ఉంటారు కదా. ఆ పాటకు డ్యాన్స్ చేసిన ఝాన్సీ కూడా అట్టాంటి, ఇట్టాంటి మహిళ కాదు వృత్తిని, ప్రవృత్తిని రెండు చక్రాలుగా మలచుకుని పల్సర్ బైక్‌ పాటలాగే దూసుకెళ్తున్న కండక్టర్‌ కమ్‌ డ్యాన్సర్ ఆమె. ఝాన్సీ జీవితంలోనూ ఆమె డాన్స్‌లో ఉన్నన్ని షేడ్స్‌ ఉన్నాయి. భార్యగా, అమ్మగా, కోడలిగా అన్నింటికీ మించి ఆర్టీసీ కండక్టర్‌గా వీటన్నింటీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ సాగిపోతున్నారు ఝాన్సీ.

ఆంధ్రప్రదేశ్ గాజువాక బీసీ రోడ్డులో ఝాన్సీ నివాసం ఉండేవారు. ఝాన్సీ 8వ తరగతిలోనే డ్యాన్స్‌ నేర్చుకున్నారు. కుటుంబ సభ్యులు ఆమెను వెనక్కిలాగినా ఆమె స్టెప్పులు ఆపలేదు. పదో తరగతి పాసయ్యాక 2011లో కండక్టర్‌ ఉద్యోగం వచ్చింది. గాజువాక డిపోలో విధుల్లో చేరింది. రోజూ ఆర్టీసీ విధుల్లో ప్రయాణం చేస్తూనే తన నృత్య ప్రస్థానం కొనసాగించారు. అనేక మంది మాస్టర్ల వద్ద నృత్య శిక్షణ తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం రమేశ్‌ మాస్టర్‌ బృందంలో చేరారు. ఇద్దరు పిల్లలతోపాటు ఇంటి పని చేసుకుంటూనే.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 వరకూ ప్రదర్శనలిచ్చారు.

"నేను చేయగలను అనే నమ్మకంతో ముందుకు వచ్చాను. చేసే ధైర్యాన్ని మా గురువు నాకు ఇచ్చారు. నువ్వు చేయగలవు అనే బలాన్ని నా భర్త, అత్తమామలు అందించారు. నేను అందరిలాగే ఉదయాన్నే లేచి ఇంటి పని చేసుకుని, నా డ్యూటీకి వెళ్లిపోతాను. సాయత్రం ఇంటికి రాగానే ఇంటి పని ఉంటే చేసుకుని.. డాన్స్​ ప్రోగ్రాం ఉంటే ప్రోగ్రాంకి లేదంటే ప్రాక్టిస్​ కి వెళ్తాను. కానీ, పిల్లలతో చాలాసేపు గడపలేక పోతున్నాను". - కండక్టర్ ఝాన్సీ , గాజువాక

ఝాన్సీ ఓ మంచి డాన్సర్‌ అని ప్రోగ్రామ్స్‌కు వెళ్లినవాళ్లకు మాత్రమే తెలుసు. కానీ, ఆమెను ప్రపంచంలోని తెలుగువాళ్లందరికీ పరిచయం చేసింది మాత్రం ఈటీవీనే. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆమెను ఆహ్వానించి డాన్స్‌ చేసే అవకాశం కల్పించారు. ఇక అంతే పల్సర్‌ బైక్‌ పాటకు ఆమె వేసిన స్టెప్పులకు సెట్‌ దద్దరిల్లింది. పల్సర్ బైక్‌ పాటేమీ కొత్తది కాదు. కానీ, ఆమె వేసిన స్టెప్పులు మాత్రం ఆ పాటకు కొత్త అందాల్ని తెచ్చాయి. ఝాన్సీ అభినయం ప్రేక్షకులతో ఈలలు వేయించింది. చప్పట్ల మోతమోగించింది. సోషల్‌ మీడియాలో లైక్‌ల వర్షం కురిపించింది. తనకు ఇన్నాళ్లకు సరైన గుర్తింపు దక్కిందంటున్నారు.

"మంచి తరుణం అనేది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో మనకు తెలియదు. ఏ రూపంలో వస్తుందో కూడా తెలియదు. కళను తనలో దాచుకోకుండా.. ఇంత దూరం చేరుకుంది అంటే తన ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి".- డాన్స్ మాస్టర్‌ రమేశ్, ఝాన్సీ నృత్యగురువు

రెండు పడవల మీద ప్రయాణం వద్దని ఝాన్సీకి చాలామంది సలహాలిచ్చారు. కొందరైతే ఈ గెంతులేంటంటూ గెలి చేసేవారు. కానీ ఆమె ఏనాడూ తన ఇష్టాన్ని వదులుకోలేదు. అలాగని విధులనూ నిర్లక్ష్యం చేయలేదు. షిఫ్టులవారీ కండక్టర్‌ విధులు నిర్వర్తించడం.. దానికి అనుగుణంగా ఇంటిపని, వంటపని చేసుకోవడం, ప్రోగ్రామ్స్‌ ఉంటే మేకప్‌ వేసుకోవడం.. ఇలా ఎందులోనూ తగ్గేదేలే అంటున్నారామె.

ఆర్టీసీ అధికారులు కూడా ఝాన్సీకి చక్కని సహకారం అందిస్తున్నారు. గాజువాక ఆర్టీసీ డిపోకి గుర్తింపు తెచ్చిందంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. విదేశాల్లో డాన్స్ షోకూ ఆహ్వానం అందిందంటున్న ఝాన్సీ.. అవకాశం ఇస్తే వెండితెరపైనా దుమ్ము దులుపుతానంటున్నారు ఝాన్సీ.

ఇవీ చదవండి:కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని సీఎం నిర్ణయం

టోల్​బూత్ వద్ద ఇద్దరు మహిళల గొడవ.. ఒకరిపై ఒకరు పడి..

ABOUT THE AUTHOR

...view details