బీడీ, సినిమా, సున్నపురాయి, మాంగనీసు, క్రోమ్, డోలమైట్, ఇనుప గని కార్మికుల పిల్లల చదువు కోసం ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర కార్మిక సంక్షేమ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ కేటగిరీలో... 11వ తరగతి నుంచి వృత్తివిద్య కోర్సుల వరకు పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఉపకారవేతనాలు అందించనుంది. ఈ నెల 31 వరకు జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ http://scholorships.gov.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని హైదరాబాద్‌లోని కార్మిక సంక్షేమ సంస్థ సంక్షేమ కమిషనర్ కోరారు.
ఉపకారవేతనాల కోసం కార్మిక సంక్షేమ సంస్థ దరఖాస్తుల ఆహ్వానం - కేంద్ర కార్మిక సంక్షేమ సంస్థ దరఖాస్తుల ఆహ్వానం
కార్మికుల పిల్లలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర కార్మిక సంక్షేమ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సంస్థ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31 వరకు జాతీయ స్కాలర్షిప్ పోర్టల్‌లో సమర్పించాలని కోరారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదిత పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం జాతీయ ఉపకార వేతనాల పోర్టల్‌ను పరిశీలించాలని... దరఖాస్తులకు సంబంధించిన సాంకేతికపరమైన అంశాలను helpdesk@nsp.gov.inకు మెయిల్ లేదా 0120-6619540కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లోని కార్మిక సంక్షేమ సంస్థను 040-24658026 లేదా wclwohyd@ap.nic.inలో సంప్రదించవచ్చన్నారు.
ఇదీ చూడండి:'విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం.. దసరా తర్వాతే నిర్ణయం'