కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యనిధి కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టారు కార్మిక నేతలు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన తీసుకోకపోవడం వల్ల ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ పెండింగ్ మొత్తాలను సకాలంలో పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు భీమ్ రావ్ పాటిల్ హెచ్చరించారు.
పీఎఫ్ కార్యాలయాల వద్ద ఏఐటియూసీ నిరసన - పీఎఫ్ కార్యాలయాల వద్ద కార్మిక సంఘాల నిరసన
కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలను సకాలంలో చెల్లించడం లేదంటూ కార్మిక సంఘాల నేతలు నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యనిధి కార్యాలయాల ముందు కార్మికసంఘాల నేతలు నిరసన చేపట్టారు.
![పీఎఫ్ కార్యాలయాల వద్ద ఏఐటియూసీ నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3521125-846-3521125-1560163472071.jpg)
పీఎఫ్ కార్యాలయాల వద్ద కార్మిక సంఘాల నిరసన