ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. నేటి ఉదయం ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనాన్ని కార్మిక నేతలు ముట్టడించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు చేతబట్టి కార్మిక నేతలు నిరసన వ్యక్తం చేశారు.
Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ భవనం ముట్టడి.. వర్షంలోనూ కార్మికుల ఆందోళన - తెలంగాణ వార్తలు
ఏపీలో విశాఖలో ఉక్కు కార్మికులు ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం కూడలి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమ ముట్టడించిన కార్మికులు, వర్షంలోనూ కార్మికుల ఉక్కు సంకల్పం
స్టీల్ ప్లాంట్‌కు వెళ్లే కార్మికులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం కూడలి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. కార్మికుల ఆందోళనతో దాదాపు రెండు కిలో మీటర్ల మేర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి:Pulasa Fish: ఆయ్ పులసండీ... రేటెంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్దండీ!