తెలంగాణ

telangana

ETV Bharat / city

తెదేపా రాష్ట్ర కమిటీ నియామకం.. మళ్లీ రమణకే బాధ్యతలు - ఎల్​ రమణ వార్తలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని చంద్రబాబు నియమించారు. వరుసగా రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్​.రమణకు అవకాశం కల్పించారు. పార్టీ ఉపాధ్యక్షురాలిగా హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని నియమించారు.

l ramana  appointed as ttdp state president by Chandrababu Naidu
రాష్ట్ర కమిటీ నియామకం.. మళ్లీ రమణకే బాధ్యతలు

By

Published : Oct 19, 2020, 3:39 PM IST

Updated : Oct 19, 2020, 3:47 PM IST

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని అధినేత చంద్రబాబు నియమించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణకు వరుసగా రెండోసారి అవకాశం కల్పించారు. హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వీరితో పాటు లక్ష్మణ్ నాయక్, అలీ మస్కటీ, భూపాల్ రెడ్డి, శ్రీశైలం, బండి పుల్లయ్య, గుండు సావిత్రమ్మ, గట్టు ప్రసాద్, గంధం గురుమూర్తి, వాసిరెడ్డి రామనాథం, తాజుద్దీన్, కాట్రగడ్డ ప్రసూన ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు.

కార్యదర్శులుగా..

రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా జక్కలి ఐలయ్య యాదవ్, ఏకే గంగాధర్ రావు, గడ్డి పద్మావతి, రాజు నాయక్, గన్నోజు శ్రీనివాస చారి, ప్రదీప్ చౌదరి, జీవీజీ నాయుడు, మహ్మద్ ఆరిఫ్, తాళ్లూరి జీవన్​ను నియమించారు.

పార్టీ అధికార ప్రతినిధులుగా..

పార్టీ అధికార ప్రతినిధులుగా నల్లూరి దుర్గా ప్రసాద్, గుండు భూపేశ్, చావా కిరణ్మయి, కరణం రామకృష్ణ, జె.ఇందిర, ఎం.శ్రీనివాసరెడ్డి, ఎం.రామేశ్వరరావు, శ్రీనివాస్ నాయుడు, రాజారెడ్డిలకు అవకాశం కల్పించారు.

రాష్ట్ర సమన్వయ కమిటీ..

మరో ఆరుగురు సభ్యులతో రాష్ట్ర సమన్వయ కమిటీని నియమించారు. ఇందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్.రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, చిలువేరు కాశీనాథ్​ సభ్యులుగా ఉంటారు.

ఇవీ చూడండి:మరోసారి భారీ వర్షసూచన.. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు

Last Updated : Oct 19, 2020, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details