హైదరాబాద్ అబిడ్స్ బొగ్గుల కుంటలోని రాష్ట్ర సారస్వత పరిషత్‌లో వంద మంది బ్రాహ్మణ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులు ఇప్పటికీ ఉపాధి లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ - Kv Ramana Chary Distributes Essential goods
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక బ్రాహ్మణ పరిషత్ ద్వారా నిరుపేద బ్రాహ్మణులకు సేవచేసే అవకాశం లభించిందని ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వంద మంది పేద బ్రాహ్మణ మహిళలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు.
పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ
అటువంటి వారిని గుర్తించి ఇప్పటి వరకు 15వేల మంది నిరుపేద బ్రాహ్మణులకు సేవా చేస్తున్న సేవావాహిని నిర్వాహకులను అభినందించారు. బ్రాహ్మణ పరిషత్ నుంచి వచ్చే సబ్సిడీలను ఉపయోగించుకొని... మహిళలు సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి అభివృద్ధి చెందాలని వేణుగోపాల చారి సూచించారు.
ఇవీచూడండి: ఆరుపదుల వయసులో సైకిల్‌పై తీర్థయాత్ర
TAGGED:
Kv Ramana Chary latest news