కరోనా విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కళాకారులకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి అపన్నహస్తం అందిస్తున్నారు. కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద కళాకారులకు వస్తు, ధన రూపంలో సాయం చేస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు.
KVR Kits : కళాకారులకు కేవీ రమణాచారి చేయూత - kv ramanachari helps artists
కరోనా విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఆపన్నహస్తం అందించారు. వస్తు, ధన రూపంలో సాయం చేస్తూ.. కళాకారులకు భరోసా కల్పిస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న హరికథ భాగవతార్లకు ఆర్థిక సాయం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హరికథ కళాకారుల బ్యాంక్ ఖాతాలో ఒక్కొక్కరికి నేరుగా 3500 రూపాయలు జమ చేశారు. ఆపద కాలంలో ఆర్ధిక చేయూత అందించిన రమణాచారికి హరిదాసులు కృతజ్ఞత తెలిపారు.
కరోనా మొదలైనప్పటి నుంచి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ కళాకారులకు ప్రతి నెల కేవీఆర్ కిట్స్ పేరిట నిత్యావసర వస్తువులు అందిస్తూ తన దాతృత్వం చాటుకుంటున్నారు. ఆపత్కాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలను అదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రమణాచారి కోరారు.