పిల్లలకు కరోనా నుంచి కాపాడే రక్షణ కవచాలుగా మారాయి చీరలు. కొవిడ్ కారణంగా నిలిపి వేసిన పాఠశాలలు తిరిగి ప్రభుత్వ అనుమతులతో ప్రారంభింనున్నారు. ఈ క్రమంలో పిల్లలు భౌతిక దూరంలో పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా వినూత్నన ఆలోచన చేశారు ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా గడివేముల జిల్లా ఉర్దూ ఉన్నత పాఠశాల యాజమాన్యం.
పిల్లలకు రక్షణ కవచాలుగా మారిన చీరలు...
భారతీయ సంప్రదాయంతో పాటు, స్త్రీల అందాన్ని పెంచి ఎంతో ఆకర్షణగా నిలిచే చీరలు... నేడు పిల్లలకు రక్షణ కవచాలుగా కూడా మారాయి. కొవిడ్ నుంచి పిల్లలను కాపాడుకునేందుకు చీరలను తెరలుగా కట్టి బోధిస్తున్నారు... ఏపీలోని ఓ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. ఈ వినూత్న పద్ధతి అందర్నీ ఆకర్షించటంతో పాటు... టీచర్ల ఆలోచనను మెచ్చుకుంటున్నారు.
పిల్లలకు రక్షక కవచాలుగా మారిన చీరలు...
విద్యార్ధుల మధ్య చీరలు కట్టి.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠాలు చెబుతున్నారు. ఈ ఆలోచన అందర్ని ఆకర్షించటంతో పాటు... పలువురు ఉపాధ్యాయులను ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండీ:టీఎస్‌బీపాస్ ప్రారంభానికి రంగం సిద్ధం