తెలంగాణ

telangana

ETV Bharat / city

CI comments viral: 'దిష్టిబొమ్మనెందుకు.. దేశాన్ని కాల్చండి..' - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

CI comments viral: ఏపీలోని కుప్పంలో తెలుగుదేశం నాయకులు చేపట్టిన ఆందోళనపై.. అర్బన్ సీఐ శ్రీధర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. తెలుగుదేశం నేతలు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా.. సీఐ శ్రీధర్‌ వారిని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఎలా దహనం చేస్తారంటూ.. దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్.. సీఐ శ్రీధర్‌ మధ్య వాగ్వాదం జరిగింది.

CI comments viral
CI comments viral

By

Published : Aug 7, 2022, 1:36 PM IST

CI comments viral: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఆంధ్రప్రదేశ్​లోని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని కుప్పంలో తెదేపా నాయకులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అర్బన్‌ సీఐ శ్రీధర్‌ ‘దిష్టిబొమ్మనెందుకు.. దేశాన్ని కాల్చండి...’ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు తెదేపా శ్రేణులు యత్నిస్తుండగా సీఐ శ్రీధర్‌ అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఎలా దహనం చేస్తారంటూ దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. ఈ క్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు పీఏ మనోహర్‌, అర్బన్‌ సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

‘మహిళతో తప్పుగా ప్రవర్తించిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని నిరసన చేపట్టాం. అలాంటి వ్యక్తి దిష్టిబొమ్మ దహనం చేస్తే తప్పేంటి. ఎంపీ మీ స్నేహితుడని అడ్డుకుంటున్నారా..’ అని మనోహర్‌ ప్రశ్నించారు. దీనిపై సీఐ శ్రీధర్‌ స్పందిస్తూ.. ‘ఇలా చేసే వారు చాలామంది ఉంటారు.. మీరు చేయలేదా.. దీని కోసం దిష్టిబొమ్మ దహనం చేస్తారా.. అతను నా స్నేహితుడని కాదు.. ఇది నా బాధ్యతగా అడ్డుకున్నా.. తప్పు తేలితే రాజ్యాంగపరంగా శిక్ష ఉంటుంది.. తప్పులు చేస్తే దిష్టిబొమ్మను కాలుస్తారా.. దిష్టిబొమ్మనెందుకు దేశాన్ని కాల్చండి....’ అంటూ వ్యాఖ్యానిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహర్‌ సహా 15 మంది తెదేపా నాయకులపై 353, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అర్బన్‌ సీఐ శ్రీధర్‌ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details