ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క నిర్ణయంతో పరిష్కార మార్గం చూపిస్తారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ బాలానగర్ డివిజన్లో రూ.34 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, వాటర్ పైప్లైన్ పనులను ఆయన ప్రారంభించారు.
'ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే కేసీఆర్ లక్ష్యం' - ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నూతన రెవెన్యూ చట్టం వల్ల పేదలు, రైతులకు లబ్ధి చేకూరనుందని.. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క నిర్ణయంతో పరిష్కారం చూపనున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్లో సీసీరోడ్డు, వాటర్ పైప్లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణారావు
కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్, నరసాపురం చౌరస్తాలో నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచారి, ఎమ్మార్వో గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. బాలానగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొని.. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించారు. నూతన రెవెన్యూ చట్టం వల్ల పేదలు, రైతులు లబ్ధి పొందుతారని తెలిపారు.