KTR Tweet Today : రాష్ట్ర ఐటీ శాక మంత్రి కేటీఆర్ నిరంతరం ట్విటర్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎవరికైనా సాయం కావాల్సి వస్తే వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులకు రీట్వీట్ చేస్తూ వారికి సాయం అందేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఈ విధంగా కేటీఆర్ చాలా మందికి సాయం చేశారు. తాజాగా ఓ వార్తావెబ్‌సైట్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో కేటీఆర్ కంటపడింది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..? దాన్ని చూసిన మంత్రి రియాక్షన్ ఏంటంటే..?
KTR Tweet Today : 'ఆ అమ్మాయి వివరాలు పంపండి.. నేను సాయం చేస్తా..' - కేటీఆర్ ట్వీట్ టుడే
KTR Tweet Today : సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలతో తరచూ కాంటాక్ట్‌లో ఉంటారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సామాజిక మాధ్యమాల ద్వారా ఓవైపు మోదీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకు పడుతూనే.. మరోవైపు సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి చేయూతనిస్తూ ఉంటారు. తాజాగా ఓ వార్తా వెబ్‌సైట్ ట్వీట్ చేసిన వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్.. ఆ వీడియోలో ఉన్న బాలిక వివరాలు చెప్పాలని.. తాను ఆమెకు సాయం చేస్తానని సదరు వెబ్‌సైట్‌కు ట్వీట్ చేశారు.
KTR Wants to help a bihari girl : బిహార్ సివాన్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్తున్న దృశ్యాలను చూసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చలించిపోయారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో చేసిన పోస్ట్‌ను చూసి.... ఆ చిన్నారి వివరాలను పంపాలని కోరారు. తన వంతుగా సాయం చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
'సివాన్ జిల్లాకు చెందిన ప్రియాన్షు కుమారి దివ్యాంగురాలు. డాక్టర్ కావాలనేది ఆమె కల. రెండు కిలో మీటర్ల దూరంలోని పాఠశాలకు... ప్రతిరోజూ ఒకే కాలుతో నడుస్తూ వెళ్తోంది. తన బాల్యం నుంచి ఇలాగే వెళ్లాల్సి వస్తోందని ప్రియాన్షు ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం తనకు కృతిమ కాలు అందించాలని వేడుకుంది.' చిన్నారి సమస్యను ఏఎన్‌ఐ ట్వీట్ చేయగా... తన వంతుగా సాయం అందిస్తానని...వివరాలు అందించాలని కేటీఆర్ కోరారు.