KTR unveiled Statue of Konda Laxman Bapuji: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద జలదృశ్యంలో బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ ఆయన విగ్రహావిష్కరణ చేశారు. తెలంగాణ సాధనతో పాటు బడుగు బలహీనవర్గాల కోసం బాపూజీ జీవితాంతం పోరాడారని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.
'అవమానకరంగా కూల్చివేసిన చోటే.. ఘనంగా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం'
KTR unveiled Statue of Konda Laxman Bapuji: ఏ జలదృశ్యాన్ని అయితే అప్పటి ప్రభుత్వం అవమానకరంగా కూల్చివేసిందో.. నేడు అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశామని ట్విటర్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. బడుగు బలహీనవర్గాలు, తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం పోరాడారని కేటీఆర్ కొనియాడారు.
KTR unveiled the statue of Konda Laxman Bapuji
ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెరాస ఉద్భవించిందో.. ఏ ప్రభుత్వమైతే అప్పుడు జలదృశ్యాన్ని అవమానకరంగా కూల్చివేసిందో.. ఈరోజు అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ట్విటర్ వేదికగా కేటీఆర్ కొండా లక్ష్మణ్ చేసిన కృషి, నిస్వార్థ సేవలను.. స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశామని ట్విటర్‌లో తెలిపారు.
ఇవీ చదవండి: