KTR Tweet on Climate Change : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ట్విటర్‌లో కేటీఆర్ చాలా యాక్టివ్. ట్విటర్ వేదికగా వచ్చే ఫిర్యాదులు, రిక్వెస్టులపై కేటీఆర్ స్పందిస్తారు. తక్షణమే సంబంధిత శాఖలకు ఆ రిక్వెస్ట్‌ను పంపించి చర్యలకు ఆదేశిస్తారు. ఇక ట్విటర్ వేదికగా కేంద్రం, మోదీ సర్కార్, ప్రతిపక్ష విపక్షాలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడతారు. చాలాసార్లు ఇతర పార్టీ నేతలకు కేటీఆర్‌కు మధ్య ట్వీట్ వార్‌లు కూడా నడిచాయి. ఇవే కాకుండా అప్పుడప్పుడు తన మనసుకు నచ్చిన విషయాలను కూడా షేర్ చేస్తుంటారు. ప్రజాసంక్షేమం, పర్యావరణం, ప్రకృతి, కళలపై కూడా అప్పుడప్పుడు కేటీఆర్ ట్వీట్ చేస్తారు. తాజాగా అలాగే ఓ ట్వీట్ చేశారు.
KTR Tweet on Climate Change : 'వాతావరణ మార్పులతో తక్షణ ముప్పు పొంచి ఉంది' - కేటీఆర్ ట్వీట్ టుడే
KTR Tweet on Climate Change : ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా పర్యావరణంపై ఓ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పులపై ట్విటర్ వేదికగా స్పందించారు. వాతావరణ మార్పులతో పుడమికి తక్షణ ముప్పు పొంచి ఉంది అన్నారు.
వాతావరణ మార్పులు తరచూ జరగకుండా.. సమతుల్యంగా ఉండాలంటే.. ఈ పుడమిని రక్షించుకోవాలంటే.. 'తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం' తరహా కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ అన్నారు. సుస్థిరాభివృద్ధి, చెట్లపెంపకంపై భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.
"వాతావరణ మార్పులతో తక్షణ ముప్పు పొంచి ఉంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఈ అంశంపై తప్పకుండా దృష్టి సారించాలి. 'తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం' తరహా కార్యక్రమాలు చేపట్టాలి. సుస్థిరాభివృద్ధి, చెట్లపెంపకంపై భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించాలి." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి