తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR Tweet Today : 'ఉచితాలు వద్దంటున్న మోదీ.. ఇస్తామంటున్న బండి' - కేటీఆర్ లేటెస్ట్ ట్వీట్

KTR Tweet on bandi sanjay today : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. కేపీహెచ్‌బీలో చేపట్టిన పాదయాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఓవైపు విశ్వగురు ఉచితాలు వద్దని చెబుతోంటే.. మరోవైపు ఈ జోకర్‌(బండి సంజయ్‌ని ఉద్దేశించి) ఉచిత విద్య, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని హామీ ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు.

KTR Tweet Today
KTR Tweet Today

By

Published : Sep 15, 2022, 10:43 AM IST

Updated : Sep 15, 2022, 2:26 PM IST

KTR Tweet on bandi sanjay today : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గట్టిగా ఫైర్ అయ్యారు. భాజపా మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని ట్వీట్ చేశారు. ఓవైపు విశ్వగురు ఏమో ఉచితాలు వద్దు అని చెబుతోంటే.. మరోవైపు ఈ జోకర్‌(బండి సంజయ్‌ని ఉద్దేశిస్తూ) ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు అంటూ హామీలు ఇస్తారేంటని మండిపడ్డారు.

KTR Latest Tweet Today : దేశాన్ని పాలిస్తోంది భాజపాయేనా కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దేశవ్యాప్తంగా ఓ సరైన నిర్ణయం తీసుకునే సత్తా లేదా అని నిలదీశారు. దేశం మొత్తానికి ఉచిత విద్య, వైద్యం, ఇళ్లు ఇచ్చేలా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేేశపెట్టుకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని కేటీఆర్ అడిగారు.

నాలుగో విడత పాదయాత్రలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో పర్యటించిన బండి సంజయ్‌కు కాలనీవాసులు తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్యల పరిష్కారానికి తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరగా రాబోయేది భాజపా ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు.తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యా వైద్యం అందించడంతోపాటు అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలోనే బండి వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు.

Last Updated : Sep 15, 2022, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details