తెలంగాణ

telangana

ETV Bharat / city

కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంపై కేటీఆర్​ హర్షం - new zonal system in telangana

కొత్త జోనల్​ విధానం అమల్లోకి రావడం పట్ల మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా స్థానికులకే 95శాతం ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని పేర్కొన్నారు.

ktr on zonal system
కొత్త జోనల్ విధానంపై కేటీఆర్​ ట్వీట్​

By

Published : Apr 21, 2021, 5:03 PM IST

కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడం వల్ల రాష్ట్రంలోని యువత ఉద్యోగాల్లో న్యాయపరమైన వాటా పొందే అవకాశం కలిగిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో స్థానిక నిరుద్యోగులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప విజయం సాధించడం సంతోషకరమని ట్వీట్​ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి.. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ.. సోమవారం రాత్రి జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పోలీసు శాఖ మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ ఈ జోన్ల విధానం వర్తిస్తుంది.

కొత్త జోనల్‌ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం కావడం సహా విద్యార్థులు, ఉద్యోగులకు అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రధానంగా విద్యా ఉద్యోగావకాశాల్లో అసమానతలు తొలగిపోయి.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానావకాశాలు దక్కనున్నాయి. అలాగే స్థానిక రిజర్వేషన్లు పక్కాగా అమలుకానున్నాయి.

ఇవీచూడండి:కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం.. గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసిన హోంశాఖ

ABOUT THE AUTHOR

...view details