KTR tweet today : హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో నెమలీకలను పిల్లలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని అటవీ అధికారులను ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ట్విటర్‌లో కోరారు. ఓ తల్లి రాసిన రాసిన లేఖకు వెంటనే స్పందిన మంత్రి కేటీఆర్ అటవీశాఖ అధికారులు చిన్న పిల్లల విషయంలో వన్యప్రాణ సంరక్షణ చట్టాలలో నెమలీకలను తీసుకోవడంలో మినహాయింపు ఇవ్వాలని వెంటనే ట్వీట్ చేశారు.
KTR tweet on Peacock Wings : "నా అయిదేళ్ల కుమారుడు వేదాంత్‌కు నెమలీకలంటే బాగా ఇష్టం. కేబీఆర్ పార్కుకు వచ్చినప్పుడు వాటిని ఏరుకొని తీసుకెళ్తుండగా అధికారులు అడ్డుకొని లాక్కుంటున్నారు. వాటిని స్టోర్‌రూమ్‌లో పెట్టడం కంటే పిల్లలకిస్తే మధురానుభూతి పొందుతారు. ఇందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను."- కేటీఆర్ ఓ తల్లి లేఖ
"ఒక చిన్నారి బాబు తల్లి రాసిన లేఖ నన్ను ఎంతగానో కదిలించింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నెమలీకలను తీసుకెళ్లడం నిషిద్ధమంటూ అటవీ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. కేబీఆర్ పార్కు అధికారులు పిల్లలకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలి’’- మంత్రి కేటీఆర్ ట్విటర్
జూపార్కులోని సింహాలకు వైద్య పరీక్షలు.. నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాలకు వెంటనే వైద్యపరీక్షలు చేయిస్తామని మంత్రి కేటీఆర్ సోమవారం ట్విటర్‌లో తెలిపారు. సింహాలు అనారోగ్యంగా ఉన్నాయని ఒక నెటిజన్ కేటీఆర్ దృష్టికి తేగా ఆయన స్పందించారు. ఈ అంశాన్ని తన దృష్టికి తెచ్చిన నెటిజన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి ట్వీట్‌పై స్పందించిన రాష్ట్ర అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఆర్‌ఎం దోబ్రియాల్.. జూపార్కులో 20 సింహాలు ఉన్నాయన్నారు. వాటిలో రెండే అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాయని చెప్పారు. మిగిలివన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఇద్దరు వెటర్నరీ వైద్యులు నిరంతరం వాటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు.