తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR Tweet Today: 'మోదీకి ముందుచూపు లేకే దేశంలో బొగ్గు కొరత'

KTR Tweet Today : కాలికి గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై మరోసారి విరుచుకు పడ్డారు. మోదీ సర్కార్ ప్రణాళికా లోపంతో దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిందని విమర్శించారు. మోదీకి ముందుచూపు లేకపోవడం వల్ల 10 రెట్లు ఎక్కువ విలువైన విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

KTR Tweet Today
KTR Tweet Today

By

Published : Jul 29, 2022, 1:14 PM IST

Updated : Jul 29, 2022, 2:16 PM IST

KTR Tweet Today : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. కాలికి గాయం కావడంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తరచూ ట్విటర్‌లో కేంద్ర విధానాలను ఎండగట్టే మంత్రి.. విశ్రాంతి సమయంలోనూ కేంద్రంపై ట్వీట్ వార్ కొనసాగించారు. ట్విటర్ వేదికగా.. మరోసారి మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. బొగ్గు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై వ్యంగ్యంగా స్పందించారు.

మోదీ సర్కార్‌ ప్రణాళికా లోపం.. ముందుచూపు లేక దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. దీంతో 10 రెట్లు ఎక్కువ విలువైన విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొందన్నారు. బొగ్గు దిగుమతి చేసుకోవడంతో తదుపరి విద్యుత్ టారిఫ్ పెరుగుతుందన్న మంత్రి... ఇందుకు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో తెలుసా అంటూ ట్వీట్‌ చేశారు. ఇదే సమయంలో దేశంలో మరో వందేళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Last Updated : Jul 29, 2022, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details