తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇండిగో సిబ్బందిపై కేటీఆర్ ఫైర్.. పద్ధతి మార్చుకోమని హితవు - కేటీఆర్ తాజా సమాచారం

KTR Tweet on Indigo Airlines Staff : కేటీఆర్ సామాజిక మాధ్యమం ట్విటర్​లో మంత్రి కేటీఆర్​ నిత్యం చురుకుగా ఉంటారు. అన్ని అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఇండిగో విమానంలో తెలుగు ప్రయాణికురాలి పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ అవమానకర ఘటనపై మంత్రి కేటీఆర్​ ట్విటర్​లో స్పందించారు.

KTR Tweet on Indigo Airlines Staff
KTR Tweet on Indigo Airlines Staff

By

Published : Sep 19, 2022, 2:13 PM IST

KTR Tweet on Indigo Airlines Staff : ట్విటర్​లో ఎప్పుడూ చురుకుగా ఉంటూ తన అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇలా ఎవరు సాయం కోసం అభ్యర్థించిన వెంటనే స్పందించి.. వాళ్లను చూసుకోవాలని తన కార్యాలయానికి సూచిస్తుంటారు. ఇలా ప్రతీ దానికి స్పందిస్తూ.. యాక్టివ్​గా ఉండే కేటీఆర్​ తాజాగా ఇండిగో విమానంలో తెలుగు ప్రయాణికురాలికి ఎదురైన అవమానకర ఘటనపై స్పందించారు. హిందీ/ఇంగ్లీష్ రాదని తెలుగు మహిళపై సిబ్బంది ప్రవర్తించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన సీట్లోంచి తీసుకెళ్లి మరో చోట కూర్చోబెట్టిన సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఘటనపై అహ్మదాబాద్‌ ఐఐఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దేవస్మిత తన ట్విటర్​లో పోస్ట్ చేశారు.

తెలుగు మహిళ సెప్టెంబర్ 16న విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో 6E 7297లో వెళ్తున్నారు. 2A(XL seat, Exit row)లో ఆ మహిళ కూర్చొని ఉండగా.. అక్కడి సిబ్బంది ఆమెకు హిందీ/ఇంగ్లిష్‌ రాదని తెలుసుకొని 3c సీట్లోకి మార్చేశారు. ఆమెతో మాట్లాడిన ఫ్లైట్‌ అటెండెంట్‌ భద్రతాపరమైన ఆందోళనగా పేర్కొంటూ తెలుగు మహిళ పట్ల వివక్ష ప్రదర్శించారంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత కేటీఆర్​కు ట్వీట్‌ చేశారు.

ట్విటర్​లో ఎప్పుడు చురుకుగా ఉండే మంత్రి కేటీఆర్ ఆమె చేసిన ట్వీట్​పై స్పందించారు. ఆ మహిళ చేసిన పోస్ట్​ను ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేశారు. ఇప్పటి నుంచైనా స్థానిక భాషలు మాట్లాడే ప్రయాణికులనూ గౌరవించాలని పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీష్ రాని వారిని చులకనగా చూడకుండా అలాంటి ప్రయాణికుల్ని గౌరవించాలని సూచించారు. విమానాలు ప్రయాణించే రూట్ల ఆధారంగా వివిధ భాషలు మాట్లాడే నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఆ విధంగా సిబ్బందిని నియమిస్తే ప్రయాణికులకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details