కేసీఆర్ ఆరోగ్యంపై.. మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని చాలా మంది నుంచి సందేశాలు పంపుతున్నారని తెలిపారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరగానే కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు కరోనా అని తెలిసి ఆందోళనకు గురయ్యానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. కోట్లాది తెలంగాణ ప్రజల దీవెనలతో సీఎం కోలుకుంటారని పేర్కొన్నారు.
కరోనా బారినపడిన కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. కరోనాతో పోరాడే శక్తిని కేసీఆర్‌కు ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
అందరి ప్రార్థనలతో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుంటారని ఎంపీ సంతోష్ ఆకాంక్షించారు. వైద్యుల బృందం సీఎం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారినపడినట్లు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఆయన ఫామ్‌హౌస్‌లో ఉన్నారన్నారు.
ఇవీచూడండి:సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్