KTR on Bilkis Bano Case: బిల్కిస్ బానో అత్యాచార దోషుల విషయంలో ట్విటర్ వేదికగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి.. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలపడంతో భాజపా స్థాయి మరింతగా దిగజారిందని అన్నారు. ఇది చాలా దిగ్భ్రాంతికరం అంటూ వ్యాఖ్యానించారు.
సంస్కారి రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిందని అందరూ చెప్పారు.. కానీ నిజానికి అందుకు అమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వమే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది అవమానకరం, అసహ్యకరం అని అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రేపిస్టులను, పిల్లలను చంపిన వారిని వదిలేయడంతో భాజపా స్థాయి మరింతగా దిగజారినట్లైందని కేటీఆర్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.
ఇదే అంశంపై గతంలోనూ..: ఇదే అంశంపై ఆగష్టులో కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు. స్వాత్రంత్య్ర దినోత్సవం రోజునే 11 మంది దోషులను విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ జోక్యం చేసుకుని ఆ రేపిస్టులను విడుదల చేయకుండా.. కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురి నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.
బిల్కిస్‌బానో నిందితుల విడుదల అప్పటి నుంచి మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపిస్టులకు పూల మాలలు వేసి యుద్ధ వీరుల్లా సత్కరించటం మన దేశంలోనే చెల్లుతుందని నిర్వేదం వ్యక్తం చేశారు. కొందరి తీరుకిది నిదర్శనమనమంటూ ఫైర్ అయ్యారు. బిల్కిస్‌కి జరిగిన ఘటన మనలో ఎవరికైనా జరగొచ్చని.. నిందితులకు పూల మాలలు వేయటంపై భారత్ గొంతెత్తి ప్రశ్నించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. గుజరాత్‌లోని సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులను రెమిసన్ కింద విడుదల ఇటీవల ఆగస్టు 15న విడుదల చేశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది.
ఇవీ చదవండి..: