హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్రీడాప్రాంగణంలో.. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిని తక్కువ కాలంలో అద్భుతంగా తీర్చిదిద్దామని పురపాలక, ఐటీశాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. క్రీడాటవర్‌ను 1500 పడకల అద్భుత ఆసుపత్రిగా తీర్చిదిద్దారని.. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, అధికారులను అభినందించారు.
టిమ్స్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం - తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వార్తలు
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. క్రీడాటవర్‌ను 1500 పడకల అద్భుత ఆసుపత్రిగా తీర్చిదిద్దిన మంత్రులు, అధికారులను అభినందించారు. భవిష్యత్‌లో పీజీ ఆస్పత్రితో పాటు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
టిమ్స్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం
కేవలం 20 రోజుల్లోనే పనులన్నీ పూర్తి చేశారని వెల్లడించారు. ఇక నుంచి కొవిడ్-19 చికిత్స కోసం ఈ ఆసుపత్రిని వినియోగిస్తారని ప్రకటించారు. భవిష్యత్‌లో పీజీ ఆస్పత్రితో పాటు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టిమ్స్‌లో వైద్యసేవలతో పాటు పరిశోధనలు సాగుతాయని చెప్పారు.
ఇదీ చదవండి:హైదరాబాద్ టు చెన్నై.. అజిత్ బైక్ రైడింగ్
TAGGED:
కేటీఆర్ ట్వీట్