KTR Tweet Today : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు.
KTR Tweet Today : 'ఏడాది ముందు తెలిసినా.. మోదీ ఏం చేయలేకపోయారు' - ప్రధానిపై కేటీఆర్ ఆగ్రహం
KTR Tweet Today :స్వాతంత్య్ర వేడుకల గురించి ఏడాది ముందు తెలిసినా.. మోదీ సర్కార్ జాతీయ జెండాలను తయారు చేయించలేకపోయిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆత్మ నిర్భర్ భారత్ చాలా బాగుందని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
KTR Tweet Today
ఎన్డీఏ సర్కార్‌ను ఎన్పీఏ సర్కార్‌గా పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ దార్శనికుడు, విశ్వగురు 75వ స్వాతంత్య్ర వేడుకల గురించి ఏడాది ముందు తెలిసినా.. జాతీయ జెండాలను తయారు చేయించలేకపోయారని ట్వీట్ చేశారు. ఆత్మ నిర్బర్ భారత్ చాలా బాగుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. జాతీయ జెండాల దిగుమతిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమర్థించిన వార్త కథనాన్ని కూడా కేటీఆర్ ట్యాగ్ చేశారు.