KTR Tour in America: తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా పదిరోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు లాస్‌ఏంజిల్స్‌లో ఘనస్వాగతం లభించింది. అక్కడి తెరాస అభిమానులు, తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రవాసీయులు మంత్రికి సాదరస్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు.
KTR Tour in America: మన ఊరు- మన బడికి ఎన్నారైలు మద్దతివ్వాలి: కేటీఆర్ - లాస్ ఏంజిల్స్‌లో కేటీఆర్
KTR Tour in America: రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు లాస్ ఏంజిల్స్‌కు చేరుకున్న కేటీఆర్‌కు.. అక్కడి తెరాస అభిమానులు, ప్రవాసీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ అభివృద్ధి, కార్యక్రమాలపై కేటీఆర్ వారితో చర్చించారు.
అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్
తెలంగాణ అభివృద్ధి, కార్యక్రమాలపై ఎన్‌ఆర్‌ఐలతో కేటీఆర్ సమగ్రంగా చర్చించారు. మన ఊరు-మన బడి కార్యక్రమ ప్రాధాన్యత, ప్రభుత్వ పాఠశాలలను ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నామో ఎన్‌ఆర్‌ఐలకు వివరించారు. ప్రభుత్వ సంకల్పానికి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రాయబారులుగా వ్యవహరించాలని సూచించారు.
ఇదీ చదవండి:TET File in CM office: సీఎం కార్యాలయానికి టెట్ దస్త్రం
Last Updated : Mar 20, 2022, 2:34 PM IST