తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా తెరాసకు ప్రజలు మద్దతు తెలిపారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2014లో 63 సీట్లు గెలిచిన తెరాస... 2018లో 88 స్థానాల్లో గెలిచిందన్నారు. ప్రతీ ఎన్నికకు ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. నేల విడిచి సాము చేయట్లేదనడానికి ఇదే ఉదాహరణ అన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. అదే తరహాలో పట్టణాల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించే విధంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా కొత్త పంచాయతీ, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు.