తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖ్యమంత్రికి కేటీఆర్​ కృతజ్ఞతలు.. ట్వీట్ చేసిన మంత్రి​ - రైతుబంధు నిధుల విడుదల చేసినందుకు కేటీఆర్​ కృతజ్ఞతలు

రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతూ... మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిధులు విడుల చేసి రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నారని అన్నారు.

ktr say thanks to cm kcr for raithubandhu funds release
ముఖ్యమంత్రి కృతజ్ఞతలు.. కేటీఆర్​ ట్వీట్​

By

Published : Jun 24, 2020, 9:20 AM IST

క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసి... ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల చిత్తశుద్ధిని మరోమారు చాటుకున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్న సమయంలోనూ రైతుబంధుకు రూ. 5250 కోట్ల విడుదలతో 50 లక్షలకుపైగా రైతులకు లబ్ధి చేకూరిందని ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఏది ఏమైనా రైతులే తమకు ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేసిందని అన్నారు. రైతుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్దికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details