తెలంగాణ

telangana

ETV Bharat / city

50లక్షలు దాటిన తెరాస సభ్యత్వాలు: కేటీఆర్ - muncipal elections

తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదుపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కమిటీల ఏర్పాటు తర్వాత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

మున్ఎసిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే: కేటీఆర్

By

Published : Jul 31, 2019, 5:31 PM IST

పార్టీ సభ్యత్వాలు 50 లక్షలు దాటడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇంకా కొన్ని జిల్లాల్లో నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అన్ని మండల, జిల్లా కమిటీలు పటిష్ఠంగా ఉండాలన్న కేటీఆర్... కమిటీల ఏర్పాటు తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పార్టీ తరఫున కార్యకర్తలకు 2 లక్షల రూపాయల బీమా కల్పిస్తున్నట్లు వివరించారు. బీమా కంపెనీకి రూ.11.21కోట్ల ప్రీమియం చెల్లించారు. మున్సిపల్​ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని... ఎప్పుడు జరిగినా తెరాస సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.

మున్ఎసిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details