బస్తీ దవాఖానాలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కేంద్రాలతో పేదలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మరో వంద బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
'ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం' - ktr latest news on basthi dhawakana
14:43 August 28
'ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం'
ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతమయ్యాయి. ఈ కేంద్రాల ద్వారా రోజూ 25 వేల మందికి ఓపీ వైద్య సేవలందించాలి. నగరంలో 197 బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీల ద్వారా రోజుకు 5 వేల పరీక్షలు చేయాలి. ప్రతిరోజూ 53 రకాల పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి. బస్తీ దవాఖానాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తుంది. ఒకట్రెండు నెలల్లో మరో వంద బస్తీ దవాఖానాలు ప్రారంభమవ్వాలి. - కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి.
సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, అన్ని జిల్లాల కలెక్టర్లు, పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు హాజరయ్యారు.
ఇవీ చూడండి:హరితవనంగా గ్రేటర్ హైదరాబాద్: మేయర్ బొంతురామ్మోహన్