తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖాజాగూడ రాతిసంపదపై స్పందించిన కేటీఆర్... తక్షణమే ఆదేశాలు జారీ... - పుప్పాలగూడ తాజా వార్తలు

ktr reply on khajaguda rocks: హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో విలువైన రాతి సంపద, చెట్లను సంరక్షించాలని సొసైటీ టు సేవ్‌ రాక్స్‌... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరుతూ ట్వీట్‌ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి తక్షణమే ఆదేశాలు జారీ చేయడంతో విచారణ చేపట్టారు. దానికి కారణమైన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ktr reply on khajaguda rocks
ఖాజాగూడ

By

Published : Mar 3, 2022, 11:48 AM IST

ktr reply on khajaguda rocks: హైదరాబాద్‌లోని పుప్పాలగూడ గ్రామంలోని ఖాజాగూడలో విలువైన రాతి సంపదతో పాటు, చెట్లు ధ్వంసం చేస్తున్న వారిపై కేసు నమోదైంది. ఈ మేరకు రాతి సంపదతో పాటు చెట్లను సంరక్షించాలని కోరుతూ సొసైటీ టు సేవ్‌ రాక్స్‌... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరుతూ ట్వీట్‌ చేసింది.

ఖాజాగూడ రాతి సంపద

సొసైటీ సభ్యులు చేసిన ట్వీట్‌ చూసి కేటీఆర్‌ స్పందించారు. ఈ విషయంపై విచారణ జరపాలని కేటీఆర్‌... పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి విచారణ జరిపి సర్వే నెంబర్‌ 452/1, 454/1 లో రాతి సంపద, చెట్లు ధ్వంసం అవుతున్నాయని గుర్తించారు.

ఇందుకు కారణమైన నలుగురిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో వీఆర్‌ఏను సస్పెండ్‌ చేశారు. ఆయా సర్వే నెంబర్లలో కాపాలదారులను నియమించారు.

స్పందించిన మంత్రి కేటీఆర్

ఇదీ చదవండి:KTR Tweet Today : 'వారి కల సాకారం చేయడం ఆనందంగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details