తెలంగాణ

telangana

ETV Bharat / city

సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోంది: కేటీఆర్ - భారత్​ బంద్​ తాజా వార్తలు

సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని ఐటీ, మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. భారత్​ బంద్​లో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బూర్గుల గేట్‌ వద్ద రహదారిపై బైఠాయించారు. కడుపుమండిన రైతులు దిల్లీలో 13 రోజులుగా ఆందోళన చేస్తున్నారని చెప్పారు.

సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోంది: కేటీఆర్
సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోంది: కేటీఆర్

By

Published : Dec 8, 2020, 12:16 PM IST

Updated : Dec 8, 2020, 1:27 PM IST

పార్లమెంట్‌లో మందబలంతో సాగు బిల్లులను ఆమోదింపజేసుకున్నారని ఐటీ, మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బూర్గుల గేట్‌ వద్ద రహదారిపై బైఠాయించారు. కేసీఆర్ నిర్ణయం మేరకు తెరాస రైతుల పక్షాన పోరాడుతోందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు సంఘీభావం తెలపాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని దుయ్యబట్టారు.

సాగు బిల్లులకు వ్యతిరేకంగా తెరాస పార్లమెంట్‌లో పోరాడిందని గుర్తు చేశారు. నూతన సాగు బిల్లులకు వ్యతిరేకంగా తెరాస ఓటేసిందన్నారు. కేంద్రం నల్లచట్టాలను బలవంతంగా రైతుల నెత్తిన రుద్దుతోందన్నారు. రైతుల న్యాయబద్ధమైన డిమాండ్ల గురించి కేంద్రం పట్టించుకోవట్లేదని అన్నారు. దేశంలో 85 శాతం అన్నదాతలు సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని చెప్పారు.

కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం హామీ ఇవ్వలేకపోయిందన్నారు. కార్పొరేట్ శక్తులు కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్‌ను శాసిస్తాయని తెలిపారు. కడుపుమండిన రైతులు దిల్లీలో 13 రోజులుగా ఆందోళన చేస్తున్నారని... రైతుల తరఫున దీర్ఘకాలికంగా పోరాడేందుకు తెరాస సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

రైతులకు ఎవరు ద్రోహం చేసినా తెరాస ఎండగడుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా రైతులను కేసీఆర్ ఆదుకుంటున్నారని చెప్పారు. వ్యవసాయం విషయంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని ఆరోపించారు. సన్నరకాలకు మద్దతు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని తెలిపారు. సన్నాలకు మద్దతు ధర ఇస్తే ధాన్యం సేకరణ నిలిపివేస్తామని కేంద్రం బెదిరిస్తోందన్నారు. రైతుల హక్కుల కోసం తెరాస ఎంతదూరమైనా వెళ్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోంది: కేటీఆర్

ఇదీ చదవండి:కదలని బస్సులు.. తెరుచుకోని దుకాణాలు...

Last Updated : Dec 8, 2020, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details