తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలోనే హైదరాబాద్​కు వస్తా..: దావోస్​లో కేటీఆర్​తో మహారాష్ట్ర మంత్రి - ktr davos tour

KTR Davos Tour: స్విట్జర్లాండ్ దావోస్​లో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్ వెళ్లిన ఇద్దరు నేతలు... అక్కడ భేటీ అయి రాష్ట్రాల అభివృద్ధి, పథకాలపై చర్చించుకున్నారు. ట్విటర్ వేదికగా కేటీఆర్ ఫొటోలను షేర్ చేశారు.

ktr davos tour
కేటీఆర్ దావోస్ పర్యటన

By

Published : May 24, 2022, 3:21 PM IST

KTR Davos Tour: దావోస్​లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే.. మంత్రి కేటీఆర్​ను దావోస్​లోని తెలంగాణ పెవిలియన్​లో కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతిపైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, మున్సిపల్, పంచాయతీ చట్టాల్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడం వంటి కీలకమైన సంస్కరణలను కేటీఆర్.. ఆదిత్య థాకరేకు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మరింత అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వస్తానని ఆదిత్య థాకరే తెలిపారు. వాటితో పాటు మహారాష్ట్రలో పట్టణ అభివృద్ధిలో చేపట్టిన పలు అంశాలపైన ఆదిత్య థాకరే.. కేటీఆర్​కి వివరాలు అందించారు. పరస్పరం కలిసి పనిచేసినప్పుడు రాష్ట్రాలు బలోపేతం అవుతాయని, తద్వారా బలమైన దేశం రూపొందుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details