తెలంగాణ

telangana

ETV Bharat / city

TRS: తెరాస ప్రధాన కార్యదర్శులతో నేడు కేటీఆర్ సమావేశం - trs latest news

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్.. తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో నేడు భేటీ కానున్నారు. తెలంగాణ భవన్​లో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ భేటీలో రాష్ట్రంలో ఇటీవల మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

KTR
KTR

By

Published : Jul 14, 2021, 5:10 AM IST

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించి.. వ్యూహాలు రూపొందించేందుకు తెరాస ప్రధాన కార్యదర్శుల భేటీ నేడు జరగనుంది. తెలంగాణ భవన్​లో ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఇవాళ్టి సమావేశానికి హాజరు కావాలని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు సమాచారం పంపించారు.

రాష్ట్రంలో ఇటీవల మారుతున్న రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్, భాజపా పట్ల అనుసరించాల్సిన వైఖరితో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. అదే తెరాస సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్, పార్టీ సభ్యుల జీవిత బీమా, జిల్లా కార్యాలయాల నిర్మాణం, తదితర అంశాలను కూడా అజెండాలో పొందుపరిచారు.

ఇవీ చూడండి:KTR: మెరుగైన విధానాలతో రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details