KTR Latest tweet on Modi : కరెన్సీపై గాంధీకి బదులు మోదీ చిత్రాన్ని మారుస్తారా..? - మోదీని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్
KTR Latest tweet on Modi : రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎల్‌జీ వైద్య కళాశాల పేరు మార్పుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరెన్సీ నోట్లపై గాంధీకి బదులు మోదీ చిత్రాన్ని మారుస్తారా అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
KTR Latest tweet on Modi : గుజరాత్‌లోని అహ్మాదాబాద్ ఎల్‌జీ వైద్య కళాశాల పేరు మార్పుపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అహ్మదాబాద్ ఎల్‌జీ వైద్య కళాశాల పేరును నరేంద్రమోదీ మెడికల్ కళాశాలగా మార్చడంపై కేటీఆర్ స్పందించారు. 'నిన్న సర్ధార్ పటేల్ స్టేడియంను నరేంద్రమోదీ స్టేడియంగా మార్చారు. నేడు ఎల్‌జీ పేరు నరేంద్రమోదీ వైద్యకళాశాలగా మార్చారు. రేపు కరెన్సీ నోట్లపై గాంధీకి బదులు మోదీ చిత్రాన్ని మారుస్తారా..?' అంటూ ట్విటర్ వేదికగా కేంద్రానికి, ప్రధాన మంత్రి మోదీకి సూటి ప్రశ్నలు వేశారు.