తెలంగాణ

telangana

ETV Bharat / city

కేటీఆర్​ నాపై ఒత్తిడి చేస్తున్నారు: మంత్రి హరీశ్​రావు - cfos meet hyderabad latest news

పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్​రావు ప్రశంసలు కురిపించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు త్వరగా విడుదల చేయాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నారని హరీశ్​రావు సరదాగా వ్యాఖ్యానించారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు హరీశ్​రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

harish interesting comments on ktr
కేటీఆర్​ నాపై ఒత్తిడి చేస్తున్నారు: మంత్రి హరీశ్​రావు

By

Published : Dec 5, 2019, 1:08 PM IST

Updated : Dec 5, 2019, 3:21 PM IST

సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్​లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎఫ్​వో-2019 సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎఫ్​వో పాత్ర మానవ శరీరంలో గుండె కాయ లాంటిదని మంత్రి హరీశ్​ అభివర్ణించారు.

కేటీఆర్​ బాగా పనిచేస్తున్నారు..

సరళతర వాణిజ్య విధానంలో ఏటా తొలి వరుసలో నిలుస్తున్నామని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్నారని హరీశ్​రావు ప్రశంసించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు త్వరగా విడుదల చేయాలంటూ కేటీఆర్ తనపై ఒత్తిడి చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

ఆర్థిక రంగం మెరుగుపడేందుకు సీఎఫ్‌వోలు, పారిశ్రామికవేత్తలు సూచనలు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. సీఎంతో మాట్లాడి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వీలైనంత త్వరగా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

కేటీఆర్​ నాపై ఒత్తిడి చేస్తున్నారు: మంత్రి హరీశ్​రావు

ఇవీచూడండి: వడ్డీ రేట్లు యథాతథం- ఆర్బీఐ కీలక నిర్ణయం

Last Updated : Dec 5, 2019, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details