కరోనా కట్టడి చర్యలు, లాక్డౌన్ నేపథ్యంలో పురపాలక శాఖకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని పట్టణాల్లో పారిశుద్ధ్య చర్యలు పెంచాలని అధికారులను ఆదేశించారు. రహదార్ల మరమ్మతులు వేగవంతం చేయాలని సూచించారు. ఐదు రూపాయల భోజన కేంద్రాలు అన్నీ పనిచేసేలా చూడాలని తెలిపారు. ఆవాసం లేని వారందరినీ గుర్తించి రాత్రి షెల్టర్లకు తరలించాలని చెప్పారు. హోం క్వారంటైన్లో ఉన్న వారందరినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతర్జాల సేవల సామర్థ్యం పెంచండి: కేటీఆర్
లాక్డౌన్ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పట్టణాల్లో పారిశుద్ధ్య చర్యలు పెంచాలని సూచించారు. ఆవాసం లేని వారందరినీ గుర్తించి రాత్రి షెల్టర్లకు తరలించాలన్నారు. ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం కలగకుండా చూడాలని సర్వీసు ప్రొవైడర్లను విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్
పరిశ్రమలు, ఐటీ కారిడార్‌లలో పారిశుద్ధ్య పనులతో పాటు, కంపెనీల్లో కూలీలు, కార్మికులకు రోజువారీ చెల్లింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి నుంచి పనిచేసే సిబ్బందికి ఇంటర్నెట్ సేవల్లో ఇబ్బందులు కలగకుండా చూడంతో పాటుగా..అంతర్జాల సేవల సామర్థ్యం పెంచాలని సర్వీస్ ప్రొవైడర్లను విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము
Last Updated : Mar 24, 2020, 7:13 PM IST