KTR Delhi Tour: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి తెరాస హాజరుకానుంది. ఇందుకోసం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు దిల్లీకి బయలుదేరి వెళ్లారు.
KTR: యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ - దిల్లీ వెళ్లిన కేటీఆర్
KTR Delhi Tour: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస పార్టీ హాజరుకానుంది. ఇందులో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ సహా పలువురు ఎంపీలు దిల్లీ వెళ్లారు.
KTR Delhi Tour
కేటీఆర్‌తో పాటు లోక్‌సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్‌రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్‌రెడ్డి తదితరులు దిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. వీరంతా ఇవాళ దిల్లీలో జరిగే రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పార్టీ తరఫున పాల్గొంటారు.
ఇవీ చదవండి :తెలంగాణ వైభవానికి అద్దం పట్టేలా.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు..
Last Updated : Jun 27, 2022, 6:42 AM IST