రక్షణ రంగాల అభివృద్ధి... ఆయా రంగాలకు సంబంధించిన కొత్త సంస్థల వ్యవస్థాపనలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు, రాజకీయ పార్టీల లబ్దికి అతీతంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరిగిన 3వ డిఫెన్స్ కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన... కేంద్ర ప్రభుత్వం తీరును ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదన్న ఆయన.... డిఫెన్స్ రంగానికి సంబంధించి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ... కేంద్రం మాత్రం నాగ్పూర్, గుజరాత్ వంటి ప్రాంతాలకే ప్రాముఖ్యత ఇస్తోందంటూ విమర్శించారు.
రాజకీయ కారణాలతో కేంద్రం వివక్ష చూపుతోంది: కేటీఆర్ - ktr of defence
భాగ్యనగరం కొన్ని దశాబ్దాలుగా రక్షణ రంగ అభివృద్ధిలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. కేంద్రం చిన్న చూపు చూస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన 3వ డిఫెన్స్ కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాజకీయ కారణాలతో కేంద్రం వివక్ష చూపుతోంది: కేటీఆర్
భాగ్యనగరంలో గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఉందన్న ఆయన... ఇక్కడ డిఫెన్స్ రంగ వృద్ధికి కావాల్సిన అన్ని రకాల మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైన కేంద్రం... ఆయా అంశాలను పరిశీలించి డిఫిన్స్ సంస్థల ఏర్పాటులో నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: 'డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాదే హబ్'
TAGGED:
ktr of defence