సూర్యాపేట జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి అశోక్ తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వరి కలుపు పరికరాన్ని తయారు చేశారు. ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి ఆ పరికరం గురించి వివరించారు. వరి పంటలో దిగుబడులను దెబ్బతీస్తోన్న కలుపు మొక్కలను అతిసులువుగా తొలగించే యంత్రాన్ని తయారు చేసినందుకు మంత్రి కేటీఆర్ విద్యార్థి అశోక్‌ను అభినందించారు. ఆ పరికరం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి దోహదపడే ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. అశోక్‌కు పూర్తి సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఫణీంద్రను ఆదేశించారు. కోల్‌కతాలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో వ్యవసాయ విభాగంలో వరి కలుపు పరికరానికి మొదటి బహుమతి అందుకోవడం విశేషం.
ఇంటర్ విద్యార్థిని అభినందించిన కేటీఆర్... ఎందుకంటే... - KTR Appreciate Intermediate Student Ashok
వ్యవసాయంలో సాంకేతికత నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో యంత్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. వరి పంటలో దిగుబడులను దెబ్బతీస్తోన్న కలుపు మొక్కలను అతిసులువుగా తొలగించే యంత్రాన్ని సూర్యాపేట జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి అశోక్ రూపొందించాడు.
ఇంటర్ విద్యార్థిని అభినందిచిన కేటీఆర్... ఎందుకంటే