కేంద్ర జల్‌శక్తి మంత్రి విడుదల చేసిన నీతి ఆయోగ్ తాజా నివేదికపై తెరాస కార్య నిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ మిషన్ కాకతీయను ప్రశంసిస్తే విపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ట్వీట్ చేశారు. మిషన్ కాకతీయ కింద 22,500 చెరువులను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 51.5 శాతం ఆయకట్టు పెరిగిందని వెల్లడించారు.
నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్, హరీశ్ హర్షం - ktr
మిషన్ కాకతీయ ద్వారా నీటి పునరుద్ధరణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలవడంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.
harish-ktr
నీతి ఆయోగ్ నివేదికపై మాజీమంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మిషన్ కాకతీయలో భాగస్వామ్యం అయిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆయన ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సాగునీటి రంగంలో సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జల వనరుల పునరుద్ధరణలో దేశంలో తెలంగాణ టాప్
Last Updated : Aug 24, 2019, 3:30 PM IST