ఆనందయ్య ఆయుర్వేద మందు వల్ల ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పేరు ప్రతి ఒక్కరికీ సుపరిచితమైంది. ఆనందయ్య ఔషధం కోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా వస్తుండడంతో వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. నివేదిక వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించినా ప్రజలు వస్తూనే ఉన్నారు.
రద్దీగా రహదారులు..
నెల్లూరు - ముత్తుకూరు - కృష్ణపట్నం రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. మందు పంపిణీ ఈ నెల 21న నిలిపివేశారని తెలిసినా ప్రజలు వాహనాల్లో వస్తూనే ఉన్నారు. పోలీసులు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆనందయ్య కోసం వస్తున్న వారికి అనుమతి నిరాకరిస్తున్నారు.
ఇదీ చదవండి: Anandaiah Medicine: ఆనందయ్య మందు నివేదికలో ఏముంది..!