గడిచిన నీటి సంవత్సరంలో వాడుకోని నీటి వాటాపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీని మీరే తేల్చాలంటూ కేంద్ర జల సంఘాన్ని(సీడబ్ల్యూసీ) కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) కోరింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి హరికేశ్ మీనా శుక్రవారం లేఖ రాశారు. ‘‘2019-20 నీటి సంవత్సరంలో ఏపీ తన వాటా 647.435 టీఎంసీలలో 651.995 టీఎంసీలు వినియోగించుకుంది. తెలంగాణ 333.527 టీఎంసీల తన వాటాలో 278.33 టీఎంసీలు వినియోగించుకుంది. మరో 50 టీఎంసీల నీటిని వినియోగించుకోలేదు. ఈ వాటాను ఈ ఏడాది వానాకాలం తొలినాళ్లలో సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ కేఆర్‌ఎంబీనీ కోరింది.
'మిగులు నీటి వినియోగం పంచాయితీని మీరే తేల్చండి'
ఈ సంవత్సరంలో మిగిలిపోయిన కేటాయింపు జలాలను తదుపరి సంవత్సరానికి బదలాయించే అంశాన్ని కేంద్ర జలసంఘానికి నివేదించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుతాన్ని కోరింది. ఈ మేరకు జలశక్తి మంత్రిత్వశాఖకు బోర్డు లేఖ రాసింది.
'మిగులు నీటి వినియోగం పంచాయితీని మీరే తేల్చండి'
దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాలు కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-1 గతంలో ఇచ్చినఆదేశాలను ఉదహరిస్తూ కేఆర్‌ఎంబీకి లేఖలు రాశాయి. దీనిపై త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు నీటి వినియోగంపై ఇప్పటికే వారి నిర్ణయాన్ని తెలిపారు. ఈ అంశాన్ని సీడబ్ల్యూసీకి నివేదించాలని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేంద్ర జలశక్తి శాఖను కోరింది.