ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ - రాయసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని లేఖ
![ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ krishna river managment board letter to andhrapradesh government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8228482-thumbnail-3x2-krisna.jpg)
12:20 July 30
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ కొత్త ప్రాజెక్ట్ చేపడుతోందని గతంలోనే తెలంగాణ ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమైందని తాజాగా మరోమారు లేఖ రాసింది.
తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ముందుకెళ్లవద్దని తాము గతంలోనే తెలిపామన్న బోర్డు... ప్రాజెక్ట్ డీపీఆర్ కూడా తమకు అందించలేదని లేఖలో పేర్కొంది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యుడు హరికేష్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.