KRMB Meeting: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఇవాళ జరగనుంది. వర్చువల్ విధానంలో కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరగనుంది.
KRMB Meeting: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
18:11 March 09
నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం
ఆ నీటిని వినియోగించుకోవద్దు..
నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించుకోవద్దని కేఆర్ఎంబీ గత నెలలో సూచించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలు రాసింది. 809 అడుగుల పైన ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 34 టీఎంసీల నీరు ఉందని... కనిష్ఠ వినియోగ మట్టాన్ని పరిగణలోకి తీసుకుంటే నికరంగా 5.2 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని బోర్డు తెలిపింది. కానీ, మే నెల వరకు తాగునీటి అవసరాల కోసం 3.5 టీఎంసీలు కావాలని తెలంగాణ, 6 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులు పంపినట్లు కేఆర్ఎంబీ పేర్కొంది.
ఇదీచూడండి:'తెలంగాణలో 91వేల ఉద్యోగాల భర్తీ.. ఏపీలో ఉద్యోగుల జీతాలకే దిక్కులేదు'