తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ అభ్యంతరాలపై స్పందించండి... ఏపీకి కృష్ణా బోర్డు లేఖ - ఏపీ కృష్ణా నది ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ చేపట్టిన పలు ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ గతంలో లేఖ రాసింది. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించాలంటూ.. తాజాగా కృష్ణా బోర్డు ఏపీ జలవనరుల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కృష్ణా నదిపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల డీపీఆర్​లు అందించాలని ఆదేశించింది.

krishna board
తెలంగాణ అభ్యంతరాలపై స్పందించండి...ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

By

Published : Nov 18, 2020, 5:01 PM IST

Updated : Nov 18, 2020, 5:06 PM IST

ఆంధ్రప్రదేశ్ జలవనరుల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. కృష్టా నదిపై ఏపీ పరిపాలన అనుమతులు ఇచ్చిన పలు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ అభ్యంతరాలపై స్పందించాలని కోరింది. లేఖలో పేర్కొన్న ప్రాజెక్టుల డీపీఆర్​లు అందించాలని ఆదేశించింది. నిప్పుల వాగు, గాలేరు నది, కుందూ నదిపై ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ... గతంలో కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసింది.

అధిక నీటి మళ్లింపు ఆలోచనతో ఈ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, దీంతో అనుమతి లేకుండా నీటిని వాడుకునే అవకాశం ఉంటుందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. కర్నూలు జిల్లాలో గుండ్రేవుల వద్ద తుంగభద్ర కుడి వైపు పాలకుర్తి ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందని, ఈ పథకం కొత్తదేనని తెలంగాణ ఆరోపించింది. నాగార్జునసాగర్ కుడి కాలువపై ఉన్న బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం పెంపుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వీటి వల్ల ఏపీ ఎక్కువ నీటిని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఇవీచూడండి:జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌

Last Updated : Nov 18, 2020, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details