తెలంగాణ

telangana

ETV Bharat / city

కృష్ణా జలాల వినియోగ వివరాలపై తెలుగు రాష్ట్రాల మధ్య కుదరని సయోధ్య - కృష్ణా బోర్డు సమావేశం

krishna board
krishna board

By

Published : Jan 12, 2021, 4:40 PM IST

Updated : Jan 12, 2021, 7:50 PM IST

16:38 January 12

కృష్ణా జలాల వినియోగ వివరాలపై తెలుగు రాష్ట్రాల మధ్య కుదరని సయోధ్య

కృష్ణా జలాల వినియోగ వివరాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్దగా సయోధ్య కుదరలేదు. వివిధ అంశాలను త్రిసభ్య కమిటీ, బోర్డు సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. వినియోగించిన జలాలకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు సయోధ్య కమిటీ హైదరాబాద్​లో సమావేశమైంది. జలసౌధలో జరిగిన సమావేశంలో బోర్డు తరఫున ఎస్ఈ ప్రకాశ్, డీఈ శ్రీధర్, తెలంగాణ నుంచి ఈఈ విజయ్ భాస్కర్, ఎస్ఈ సుమతి, ఆంధ్రప్రదేశ్ తరఫున ఎస్ఈ మనోహర్ రాజు, ఈఈ ప్రతాప్ పాల్గొన్నారు.  

భిన్న వాదనలు

ఉపయోగించుకున్న జలాల విషయమై రెండు రాష్ట్రాలు రెండు భిన్న వాదనలను వినిపించాయి. సాగర్ ఎడమకాల్వ నీటి వినియోగం విషయంలో రెండు రాష్ట్రాలూ బాగా పట్టుబట్టాయి. కేసీకెనాల్ నుంచి కర్నూలు నగరానికి ఇస్తున్న మంచినీటి లెక్కింపు విషయం కూడా చర్చకు వచ్చింది. పోతిరెడ్డిపాడు ద్వారా చెన్నైకి ఎక్కువగా నీరు ఇచ్చినందున తమ కోటా కింద పరిగణించరాదని ఏపీ తెలిపింది. ఈ విషయమై త్వరలో జరగనున్న చెన్నై తాగునీటి కమిటీ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.  

ఆ సమావేశంలో అన్ని అంశాలపై చర్చ

వరద సమయంలో తీసుకున్న నీటిని లెక్కించాలని, గత ఏడాది మిగిలిన 50 టీఎంసీలు క్యారీ ఓవర్ కింద ఇవ్వాలని తెలంగాణ కోరింది. క్యారీ ఓవర్, సర్ ప్లస్ నీటి అంశాలను బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. మిగతా అన్ని అంశాలను త్వరలో జరిగే బోర్డు త్రిసభ్య కమిటీలో చర్చించనున్నారు.  

ఇదీ చదవండి :హైదరాబాద్‌ కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి కొవిషీల్డ్‌ టీకాలు

Last Updated : Jan 12, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details