తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు 82.02 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 92.50 టీఎంసీలు కేటాయించింది. మార్చి 31 నాటికి నీటిని కేటాయించేందుకు కేఆర్బీఎం అనుమతినిచ్చింది. ఈనెల 5న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి కేటాయింపులు జరిపారు.
నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు... - కృష్ణా నదీ నిర్వహణ బోర్డు
రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 5న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి కేటాయింపులు జరిపారు. మార్చి 31 నాటికి నీటిని కేటాయించేందుకు కేఆర్బీఎం అనుమతినిచ్చింది.
krishna river board gave water allotments
తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 17.92 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 65 టీఎంసీల నీటిని విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 27.90 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 64.60 టీఎంసీల విడుదలకు అనుమతినిచ్చింది.