తెలంగాణ

telangana

ETV Bharat / city

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై రేపు గెజిట్‌ విడుదల

gazette on Krishna, Godavari river management boards limit
gazette on Krishna, Godavari river management boards limit

By

Published : Jul 15, 2021, 7:51 PM IST

Updated : Jul 15, 2021, 8:37 PM IST

19:48 July 15

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై రేపు గెజిట్‌ విడుదల

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జల్‌శక్తి శాఖ రేపు గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాల జలవివాదం నేపథ్యంతో ఈ గెజిట్లకు ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ గెజిట్లు విడుదల చేయనున్నట్టు సమాచారం. గెజిట్లలో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అంశాలు పొందుపర్చారు.

2014 పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉన్నా.. ఈ ప్రక్రియ ఏడేళ్లపాటు ఆలస్యమైంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధి నిర్దేశించేందుకు 2020 అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల్‌శక్తి మంత్రితో కూడిన అపెక్స్‌ కమిటీ సమావేశమైనా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిధిని నిర్దేశించే అధికారం కేంద్రానికి ఉంటుందని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

ఇవీచూడండి:జలవిద్యుత్ ఉత్పత్తి ఆపాలని ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ

Last Updated : Jul 15, 2021, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details