కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ (jal shakti Gazette)అమలు వేగవంతమయ్యేలా చూడాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కృష్ణా (krmb), గోదావరి నదీ యాజమాన్య బోర్డులు (grmb) కోరాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.
jal shakti Gazette: 'జల్‌శక్తి గెజిట్ అమలు వేగవంతమయ్యేలా చూడండి' - తెలంగాణ తాజా వార్తలు
కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు వేగవంతమయ్యేలా చూడాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు కోరాయి. సీడ్ మనీ కింద ఇవ్వాల్సిన 200 కోట్ల రూపాయల నిధులూ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేఆర్ఎంబీ కోరినట్లు తెలిసింది.
![jal shakti Gazette: 'జల్‌శక్తి గెజిట్ అమలు వేగవంతమయ్యేలా చూడండి' jal shakti Gazette](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13534099-348-13534099-1635892758618.jpg)
కేంద్రం జారీచేసిన గెజిట్‌ను (jal shakti Gazette) గత నెల 14వ తేదీ నుంచి అమలుచేయాల్సి ఉందని... అందుకు అవసరమైన సమాచారం, వివరాలు తమకు ఇంకా పూర్తి స్థాయిలో అందలేదని అందులో లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా వివరాలు, సమాచారం అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని, ప్రాజెక్టులను స్వాధీనం చేసేలా చూడాలని సీఎస్‌లను కోరినట్లు సమాచారం. ఇదే సమయంలో సీడ్ మనీ కింద ఇవ్వాల్సిన 200 కోట్ల రూపాయల నిధులూ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేఆర్ఎంబీ కోరినట్లు తెలిసింది. ఇదే తరహాలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు కూడా రెండు రోజుల క్రితం లేఖ రాసింది.
ఇదీచూడండి:Yadadri Temple: పచ్చదనంతో... సహజత్వం ఉట్టిపడేలా యాదాద్రి పుణ్యక్షేత్రం