ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో నేటి సాయంత్రం కోటి దీపోత్సవం కార్యక్రమం జరగనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో భ్రమరాంబ తెలిపారు. దీపోత్సవానికి అవసరమైన నువ్వుల నూనె, కోటి వత్తులు, అఖండ దీపానికి అవసరమైన వత్తులు దాతలు అందజేసినట్లు ఈవో వివరించారు.
koti deepotsavam: ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం... ముఖ్య అతిథిగా శారదా పీఠాధిపతి
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపైన గల దుర్గమ్మ ఆలయంలో ఈరోజు సాయంత్రం కోటి దీపోత్సవం కార్యక్రమం జరగనుంది. దీపోత్సవానికి విశాఖ శారదా పీఠం వ్యవస్థాపకులు స్వరూపానంద స్వామి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
దీపోత్సవానికి విశాఖ శారదా పీఠం వ్యవస్థాపకులు స్వరూపానంద స్వామి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఈనెల19న నిర్వహించే గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ట్రస్ట్ బోర్డు ఆమోదించిందన్నారు. గంగ, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను అలంకరించి ప్రచార రథాన్ని సిద్ధం చేశామని తెలిపారు.
ఇదీ చదవండి : TIRUMALA : తిరుమలలో నేడు కార్తిక దీపోత్సవం... గరుడవాహనంపై దర్శనమివ్వనున్న శ్రీవారు