తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆనందయ్య మందు.. కోటయ్య మృతి - నెల్లూరు జీజీహెచ్‌

Retired headmaster Kotayya dies with Corona
కరోనాతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి

By

Published : May 31, 2021, 10:34 AM IST

Updated : May 31, 2021, 7:41 PM IST

10:31 May 31

ఆనందయ్య మందు.. కోటయ్య మృతి

ఆనందయ్య మందు.. కోటయ్య మృతి

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో కరోనాతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి చెందారు. కరోనాతో పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్‌లో కోటయ్య చేరారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.

వైరస్ సోకిన తర్వాత ఆనందయ్య మందును ఆయన తీసుకున్నారు. ఔషధం తీసుకున్నాక కోలుకున్నట్లు గతంలో కోటయ్య స్వయంగా ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటనతో ఆనందయ్య మందు ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే.. మళ్లీ ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల కోటయ్య ఇటీవల ఆస్పత్రిలో చేరారు. నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.

ఇదీ చూడండి: anandaiah Medicine: నేడే తుది నివేదిక.. ఔషధ పంపిణీపై హైకోర్టులో విచారణ

Last Updated : May 31, 2021, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details