తెలంగాణ

telangana

ETV Bharat / city

Maoist Surrender: మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలి లొంగుబాటు - CPI Maoist Pedabayalu Area Committee

ఏపీ విశాఖ పోలీసుల ఎదుట సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రాకుమారి లొంగిపోయారు. 46 చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాలుపంచుచుకున్నారని పోలీసులు తెలిపారు.

Maoist
మావోయిస్టు

By

Published : Oct 16, 2021, 4:41 PM IST

సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రాకుమారి ఏపీ విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. 6 హత్యలు, 5 ఎదురు కాల్పులతో పాటు 46 చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. ఈ ఘటనల్లో కొర్రాకుమారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలు, వివక్ష, ఎన్ కౌంటర్లలో సహచరులను కోల్పోవడం వంటి కారణాలతో లొంగిపోయినట్లు కుమారి అలియాస్ శ్వేత తెలిపారు.

కొర్రకుమారి అలియాస్​ శ్వేత.. దాదాపు 12 ఏళ్లు ఈమె మావోయిస్టు పార్టీలో ఉన్నారు. ఈమె.. 6 హత్యలు, 5 ఎదురు కాల్పులతో పాటు 46 చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో వివక్ష, తదితర కారణాల వల్ల లొంగిపోయారు. ఈమెకు ప్రభుత్వం నుంచి రావల్సిన లబ్దిని అందేలా చూస్తాం.

-బి.కృష్ణారావు, విశాఖ జిల్లా ఎస్పీ

మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రాకుమారి లొంగుబాటు

ఇవీ చూడండి: daughter-in-law killed her uncle:ఆ పనికి అడ్డువస్తున్నాడని మామను చంపిన కోడలు

ABOUT THE AUTHOR

...view details